అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Miss World competitions | తెలంగాణ ప్రభుత్వం telangana govt ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిస్ వరల్డ్ పోటీలకు Miss World competitions ప్రపంచంలోని వివిధ దేశాల సుందరిలు తరలి వస్తున్నారు. హైదరాబాద్ hyderabad వేదికగా ఈ నెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో 120 దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా దేశాలకు చెందిన పోటీదారులు భాగ్యనగరం చేరుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం ఉదయం మిస్ బ్రెజిల్ miss brasil జెస్సికా పెడ్రోసో jessica pedrosa శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే ఈ పోటీల ఏర్పాట్లను పరిశీలించేందుకు మిస్ వరల్డ్ సీఈవో, ఛైర్పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి హైదరాబాద్ వచ్చారు. మిస్ కెనడా ఎమ్మా డయన్నా క్యాథరీన్ మోరీసన్ కూడా హైదరాబాద్కు విచ్చేశారు.
Miss World competitions | తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసేలా..
మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పర్యాటక, చారిత్రక ప్రదేశాలను ఆయా దేశాల ప్రతినిధులకు చూపెట్టనున్నారు. దీని కోసం పర్యాటక శాఖ tourism dept అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్, లాడ్ బజార్, చౌమొహల్లా ప్యాలెస్, వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను పోటీదారులు, ఆయా దేశాల ప్రతినిధులు సందర్శించనున్నారు.