ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిIndiramma houses | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

    Indiramma houses | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Indiramma houses : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో నియోజకవర్గంలో 3500తో పాటు అదనంగా మరో ఎనిమిది వందల ఇళ్లు అదనంగా మంజూరైనట్లు పేర్కొన్నారు.

    నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామ శివారులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాలలో ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గతంలోనే ఇందిరమ్మ కమిటీల(Indiramma committees)ను ఏర్పాటు చేశామని, కమిటీల ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ విడతల వారీగా జరుగుతుందన్నారు. నిర్మాణ పనులు జరిగే తీరును బట్టి బిల్లుల విడుదల సవ్యంగా కొనసాగుతుందన్నారు.

    జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ మండలానికి చెందిన నాయకుడు 35 ఏళ్లుగా టీడీపీ, బీఆర్​ఎస్,​ కాంగ్రెస్ అంటూ నిలకడ లేకుండా పార్టీలలో తిరుగుతూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అదనంగా మంజూరు చేయిస్తామని మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. సదరు వ్యక్తి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామన్నారు. సమావేశంలో నాయకులు గుర్రపు శ్రీనివాస్ పటేల్ , ప్రజాపండరి లక్ష్మయ్య, రాజారాం, బాల సాయిలు, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...