అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mirzaguda road accident : గత ఏడాది రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో Road Accident 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మరచికపోకముందే, అదే ప్రాంతంలో మరో విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. మోకిల నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా ధ్వంసమైన కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Mirzaguda road accident | అంతా విద్యార్ధులే..
గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి Hospital తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో మృతి చెందినవారు ఐసీఫాయ్ యూనివర్సిటీ, ఎంజీఐటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు. వీరంతా మోకిల నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరగా, మీర్జాగూడ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిని సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌గా పోలీసులు గుర్తించారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు Police ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అదే ప్రాంతంలో గతంలో కూడా ఘోర ప్రమాదం జరగడంతో, మీర్జాగూడ వద్ద రోడ్డు భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుస ప్రమాదాలతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.