HomeUncategorizedMirai Movie | రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మిరాయ్.. కేవ‌లం ఐదు రోజుల్లోనే...

Mirai Movie | రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మిరాయ్.. కేవ‌లం ఐదు రోజుల్లోనే అరుదైన ఫీట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mirai Movie | యంగ్ హీరో తేజ సజ్జా నటించిన సూపర్ హీరో ఫాంటసీ డ్రామా ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే మిరాయ్ (Mirai Movie) 100 కోట్ల మార్కను అందుకొని ఆశ్చ‌ర్య‌పరుస్తోంది.

అలానే యూఎస్ మార్కెట్​లో కూడా స‌రికొత్త మైల్ స్టోన్ సాధించింది. త‌క్కువ స‌మ‌యంలోనే 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్​ను ఈ చిత్రం అందుకోవ‌డం విశేషం. దీంతో వసూళ్ల పరంగా ‘మిరాయ్​’తో మరోసారి తేజ సజ్జ (Teja Sajja) తన కెరీర్​లో రెండో రూ. 100 కోట్ల సినిమాను త‌న ఖాతాలో వేసుకున్నాడ‌నే చెప్పాలి. తొలి రోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్‌తో దూసుకెళ్లిన మిరాయ్, యాక్షన్, ఎమోషన్, ఫాంటసీ అంశాలను సమపాళ్లలో మిళితం చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Mirai Movie | తేజ హ‌వా..

తేజ సజ్జా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ (Energetic Performance), అద్భుతమైన విజువల్స్‌, ఆక‌ట్టుకునే మ్యూజిక్, స‌రికొత్త‌ స్క్రీన్‌ప్లే సినిమా సూప‌ర్ హిట్ అయ్యేలా చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మిరాయ్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌ను బట్టి చూస్తే త్వరలోనే మిరాయ్ రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించబోతున్నదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రిపీట్ ఆడియెన్స్ రావడం సినిమాకు మరింత బలాన్నిస్తోంది. ఈ విజయంతో తేజ సజ్జా కెరీర్ కీలక మైలురాయిని దాటినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘హనుమాన్’ తర్వాత ‘మిరాయ్’తో వరుసగా రెండు బ్లాక్‌బస్టర్లను అందుకున్న తేజ, ఇప్పుడు టాప్ హీరోల సరసన నిలిచేందుకు పోటీ ప‌డుతున్నాడు.

తక్కువ బడ్జెట్‌లో ఈ స్థాయి విజువల్ గ్రాండియర్‌ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Director Karthik Ghattamaneni)పై విమర్శకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన క్రియేటివ్ నేరేషన్‌, హాలీవుడ్ స్థాయి సీజీ వర్క్‌, మినిమమ్ బడ్జెట్‌లో మ్యాక్సిమమ్ అవుట్‌పుట్ అందించగల సామర్థ్యం సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫాంటసీ ఎలిమెంట్స్‌, మిరాయ్‌లో చూపించిన విజువల్ విజన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ రేంజ్‌లో మిరాయ్ దూసుకుపోతుండటంతో, రాబోయే రోజుల్లో ఇది ₹150 కోట్ల మార్క్‌ని కూడా అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్‌తో తేజ, కార్తీక్ ఘట్టమనేని, ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్(Producer TG Vishwa Prasad) కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో మరింత ఆసక్తి నెలకొంది.