HomeUncategorizedMirai collections| మిరాయ్ జోరు మాములుగా లేదు.. తొలి రోజు క‌న్నా ఎక్కువ క‌లెక్ష‌న్స్

Mirai collections| మిరాయ్ జోరు మాములుగా లేదు.. తొలి రోజు క‌న్నా ఎక్కువ క‌లెక్ష‌న్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mirai collections | టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ‘మిరాయ్’ సినిమా (Mirai Movie) బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. ప్రీమియర్ షోల నుంచి హౌస్‌ఫుల్ షోల (House Full Shows) వరకూ.. సినిమాకు వస్తున్న స్పందన అదిరిపోయింది.

విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 27.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధికారికంగా ప్రకటించింది. ఇండియాలో ‘మిరాయ్’ సినిమా మొదటి రోజు రూ.13 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టగా, రెండో రోజు మాత్రం అంతకంటే ఎక్కువగా రూ. 13.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. శనివారం అన్ని ప్రాంతాల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ వర్షన్‌కి రెండో రోజు ఆశ్చర్యకరంగా కలెక్షన్లు పెరిగాయి.

Mirai collections | భాషలవారీగా వసూళ్లు ..

భారత్‌లోని ప్రధాన భాషల వారీగా చూసుకుంటే, రెండో రోజున తెలుగు వర్షన్ రూ. 11 కోట్లు, తమిళం రూ. 10 లక్షలు, కన్నడ – రూ. 5 లక్షలు, మలయాళం – రూ. 5 లక్షలు కలెక్షన్ రాబట్టాయి. హిందీ వర్షన్ మొదటి రోజు రూ. 1.65 కోట్లు వచ్చినప్పటికీ, రెండో రోజు అది రూ. 2.5 కోట్లు దాటింది. ఇండియాలో రెండు రోజుల్లో ‘మిరాయ్’ టోటల్ నెట్ కలెక్షన్ రూ. 27 కోట్లుగా ఉంది. దీంతో, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా స్టడీగా ముందుకు సాగుతోంది.

మొదటి రోజు హిట్ టాక్ రావడమే కాదు, మౌత్ టాక్ (Mouth Talk) కూడా సినిమా కలెక్షన్లు పెరగడానికి కారణమయ్యాయి. అంతర్జాతీయంగా కూడా ‘మిరాయ్’ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. నార్త్ అమెరికాలో మొదటి రోజు $7,00,000 (సుమారుగా రూ. 5.8 కోట్లు) వసూలైంది. రెండో రోజుతో కలిపి సినిమా వన్ మిలియన్ డాలర్ క్లబ్లోకి ఎంటరై పోయింది.

ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో ‘మిరాయ్’ సాధించిన గ్రాస్ వసూళ్లు రూ. 50 కోట్లకు పైగానే ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ ముగిసేలోపు సినిమా రూ. 100 కోట్లు గ్రాస్ టార్గెట్‌ను చేరే అవకాశం ఉన్నదని, వీక్‌డేస్ కలెక్షన్ల బట్టి అది రూ. 150 కోట్ల వరకు వెళ్లే అవకాశం కూడా ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. తేజ సజ్జా (Teja Sajja) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ పాత్రలో మెప్పించారు. శ్రియా శరణ్ (Shreya Sharan) తల్లిగా, ‘అర్జున కళ్యాణం’ ఫేమ్ రితిక నాయక్ హీరోయిన్‌గా కనిపించారు. జగపతిబాబు (Jagapati Babu), జయరామ్, గెటప్ శ్రీను (Getup Srinu), కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, ఈ సినిమాతో మ‌రోసారి త‌న టాలెంట్ చూపించారు.