Homeజిల్లాలునిజామాబాద్​Care Degree College | పర్యావరణ అధ్యయనానికి ఆధునికత తోడైతే అద్భుతాలు

Care Degree College | పర్యావరణ అధ్యయనానికి ఆధునికత తోడైతే అద్భుతాలు

నగరంలోని కేర్​ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ అధ్యయనంపై యానిమేషన్ వీడియో ప్రదర్శించారు. కార్యక్రమంలో కేర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Care Degree College | పర్యావరణ అధ్యయనానికి ఆధునికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని కేర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ (Narala Sudhakar) అన్నారు. జంతు శాస్త్ర విభాగం (Department of Zoology) ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ అధ్యయనంపై యానిమేషన్ వీడియో ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ అధ్యయనానికి కంప్యూటర్ విజ్ఞానాన్ని జోడించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కేవలం పాఠాలు చెబితే గుర్తుండడం కష్టమని అదే పాఠాన్ని దృశ్యశ్రవణంగా మారిస్తే విద్యార్థులు ఎప్పటికీ మరిచిపోకుండా ఉంటారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలకృష్ణ, జంతు శాస్త్ర అధ్యాపకురాలు అస్మా, సాబాజ్, అర్బాజ్ తదితరులు పాల్గొన్నారు.