Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | మైనర్లు వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్​ ఏసీపీ

Nizamabad | మైనర్లు వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్​ ఏసీపీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad | మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ట్రాఫిక్​ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) అన్నారు. నగరంలోని సుభాష్ నగర్​లో గల కాకతీయ ఒలింపియాడ్ పాఠశాల(KOS)లో విద్యార్థులకు మంగళవారం ట్రాఫిక్​ రూల్స్​పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పలువురు పాఠశాల స్థాయి విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారన్నారు. మైనర్లు డ్రైవింగ్​ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే స్కూల్ బస్సుల డ్రైవర్లకు పూర్తి ఫిట్​నెస్​ ఉంటేనే విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు, ప్రిన్సిపాల్ చంద్రశేఖరరావు, ఇన్​ఛార్జి వైకే సంపత్ తదితరులు పాల్గొన్నారు.