అక్షరటుడే, ఎల్లారెడ్డి: Badminton Championship | నిజామాబాద్‌లో జరిగిన మూడో జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో (District Level Sports Competitions) ఎల్లారెడ్డిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను (Ball Badminton Championship) కైవసం చేసుకున్నారు. అలాగే పదో తరగతికి చెందిన డి.అఫ్రోజ్ అండర్-17 లాంగ్ జంప్‌లో రజత పతకాన్ని సాధించాడు.
ఎనిమిదో తరగతికి చెందిన బీమల్ అండర్-14 లాంగ్ జంప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. వీటితో పాటు పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఆదిల్ అండర్-17 ఫుట్‌బాల్ రాష్ట్ర స్థాయి జట్టుకు, పదో తరగతికి చెందిన అరవింద్, అన్సార్ అండర్-17 రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపికయ్యారు. అలాగే పదో తరగతికి చెందిన అఫ్రోజ్, ఆసిఫ్, అనాస్ అండర్-17 రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, ప్రిన్సిపల్ మహమ్మద్ రఫత్, పీఈటీ జ్ఞానేశ్వర్, ఎస్కార్ట్ టీచర్లను బుధవారం ప్రత్యేకంగా అభినందించారు.