221
అక్షరటుడే, బోధన్: Gram Panchayat Elections | తొలివిడత పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నేపథ్యంలో బోధన్ డివిజన్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే సాయంత్రం కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా సాలూర మండలం (Saloora mandal) జాడి జమాల్పూర్ గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Gram Panchayat Elections | కౌంటింగ్ అనంతరం..
కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థి, ఆయన మద్దతుదారులు సంబురాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో హంగామా జరగడంతో పోలీసులు (Police) వారిని అడ్డుకున్నారు. దీంతో గెలిచిన అభ్యర్థి మద్దతుదారులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో సమాచారం అందుకున్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గొడవను సద్దుమణిగేలా చూశారు.