HomeUncategorizedPalnadu | భ‌ర్త మీద కోపం.. పెన్నులు మింగేసిన భార్య

Palnadu | భ‌ర్త మీద కోపం.. పెన్నులు మింగేసిన భార్య

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Palnadu | భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు రావడం సర్వసాధారణమే. అయితే కొన్ని సందర్భాల్లో ఆ గొడవలు ఊహించని విధంగా మారతాయి. అలాంటి ఘటనే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో (Palnadu district) చోటు చేసుకుంది. భర్తతో జరిగిన గొడవలో కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన ఓ 28 ఏళ్ల మహిళ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తన బాధను బయటపెట్టింది. ఆమె చేసిన పని డాక్టర్లను (Doctors), కుటుంబ సభ్యులను మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని కూడా షాక్‌కు గురిచేస్తోంది. వివ‌రాల‌లోకి వెళితే పల్నాడు జిల్లాలోని నరసరావుపేటకు చెందిన ఓ మహిళ, తన భర్తతో గొడ‌వ‌ప‌డింది.

Palnadu | విచిత్ర‌మైన ప‌ని..

ఆ స‌మ‌యంలో ఆమె కోపంతో ఊగిపోయింది. మానసికంగా తీవ్ర ఆవేదనకు లోనైంది. దీంతో ఆమె త‌న కోపాన్ని వ‌స్తువుల‌పైనో లేదంటే ఇత‌రుల‌పైనో చూపించ‌కుండా త‌న‌పైనే చూపించుకుంది. నాలుగు పెన్నులను అమాంతం మింగేసింది. పెన్నులు మింగిన కొన్ని గంటలలోనే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వినుకొండ రోడ్డులోని మాతాశ్రీ ఆసుపత్రికి (Matashree Hospital) తీసుకు వెళ్లారు. అనుమానంతో స్కాన్‌లు, ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. రిపోర్ట్‌లో ఆమె కడుపులో నాలుగు పెన్నులు ఉన్నట్టు గుర్తించారు.

ఆమె ఆరోగ్యం దెబ్బతినకముందే, డాక్టర్లు అత్యవసరంగా ఆపరేషన్‌కు (emergency operation) సిద్ధమయ్యారు. అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ (advanced laparoscopic surgery) ద్వారా ఎలాంటి స‌ర్జ‌రీ చేయకుండా నాలుగు పెన్నులను కడుపులో నుంచి తొలగించారు. సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆమెతో మాట్లాడిన వైద్యులు, పెన్నులు కడుపులోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించగా, ఆమె చెప్పిన మాటలు అందరికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాయి. భర్తతో గొడవయ్యాక ఆ కోపాన్ని దిగమింగలేక పెన్నులు మింగేశా అని తెలిపింది. అది విన్నవారెవ్వరి నోట మాట రాలేదు. ఇలా కూడా కోపం తీర్చుకుంటారా అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.