అక్షరటుడే, ఎల్లారెడ్డి : Mla Madan Mohan Rao | బీఆర్ఎస్ హయాంలో మైనర్ ప్రాజెక్టులపై చిన్నచూపు చూడడంతోనే ప్రస్తుత వరదలకు కారణమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(Mla Madan Mohan Rao) పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో ఎల్లారెడ్డిని అభివృద్ధి చేసుకుంటానమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
Mla Madan Mohan Rao | కష్టకాలంలో రావాల్సింది పోయి..
రైతుల పంటలు వరదల్లో మునిగిపోగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల సమయంలో నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని హరీష్‌రావు ఇప్పుడు తాపీగా వచ్చి ‘కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన అన్నారు. కష్టాల్లో ఉన్న రైతుల దుఃఖాన్ని రాజకీయ లాభం కోసం వినియోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
Mla Madan Mohan Rao | పోచారం ప్రాజెక్టును కాపాడుకున్నాం..
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ సిల్ట్ రిమూవల్, స్ట్రెంథెనింగ్ పనులు సమయానికి చేయకపోవడం వల్లే భారీ వరదలు(Heavy Floods) భారీ నష్టం కలిగించాయని మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. సుమారు 10వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు. పోచారం ప్రాజెక్ట్ పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి వస్తే.. పోచారం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేయింబవళ్లు కష్టపడి మట్టిసంచులు నింపి, త్రిలింగేశ్వర స్వామి దయతో కాపాడుకున్నామని వివరించారు. 100 ఏళ్లకు పైబడిన ప్రాజెక్టు ఎల్లారెడ్డి ప్రజల గుండెకాయ లాంటిదన్నారు.
Mla Madan Mohan Rao | కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ..
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై హరీష్‌రావు అమితమైన శ్రద్ధ తీసుకుని మిగితా ప్రాజెక్టులను చిన్నచూపు చూశారని ఎమ్మెల్యే మదన్ మోహన్ దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా కాళేశ్వరం అవినీతి, హరీష్ రావు పాత్ర గురించి బహిరంగంగా వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందనని స్పష్టం చేశారు.ఒకవేళ షరీష్ రావు(Harish Rao) నన్ను సమావేశానికి ఆహ్వానించి ఉంటే.. ఎల్లారెడ్డి ప్రజలకు బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని స్పష్టంగా వివరించేవాడినని ఆయన పేర్కొన్నారు. తన సొంత ఊరు అయిన నల్లమడుగులో చిన్న డ్రెయినేజీ కాలువ కూడా కట్టించుకోలేని జాజాల సురేందర్ ఈరోజు నేను వరల్డ్ బ్యాంక్‌కు వెళ్తే.. ఎద్దేవా చేయడం ఆయనకే చెల్లిందన్నారు. ప్రజలే అధికారం.. ప్రజలకే ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
1 comment
[…] సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ (Mla Madan Mohan) గారు మాట్లాడుతూ మౌలిక సదుపాయాల […]
Comments are closed.