అక్షరటుడే, వెబ్‌డెస్క్: Railway Timings | దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి కొత్త రైల్వే టైమ్ టేబుల్ అమల్లోకి రానుంది. దీంతో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. గతంలో జూలై 1 నుంచి రైళ్ల వేళలను మార్చేవారు. ఇప్పుడు జనవరి 1 నుంచి అమలు చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 1,400 రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. దక్షిణమధ్య రైల్వే (South Central Railway) పరిధిలో 80కిపైగా రైళ్ల వేళలు మారనున్నాయి.
3 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఈ సమయాలను మార్చినట్లు అధికారులు తెలిపారు. మారిన టైమ్ టేబుల్ వివరాలను ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. కరీంనగర్ నుంచి కాచిగూడ డెమో ఎక్స్ ప్రెస్ రైలు నిజామాబాద్ జంక్షన్‌కు జనవరి 1వ తేదీ నుంచి సాయంత్రం 6:50 నిమిషాలకు బదులుగా 6:00 గంటలకు చేరుకుంటుంది. కరీంనగర్ నుంచి బోధన్ 67773 మెము ప్యాసింజర్ రైలు నిజామాబాదు జంక్షన్‌కు (Nizamabad Junction) సాయంత్రం 7:55 నిమిషాలకు బదులుగా 7:15 నిమిషాలకు చేరుకుంటుంది.