అక్షరటుడే నిజాంసాగర్: jukkal | జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) ఈనెల 20వ తేదీన మంత్రులు సీతక్క (Minister seethakka), జూపల్లి కృష్ణారావు (Minister jupally) రానున్నట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (Mla Laxmi Kantha Rao)పేర్కొన్నారు. పెద్దకొడప్గల్లో (Peddakodapgal) నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న పర్యాటక పనుల శంకుస్థాపనతో పాటు పిట్లం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో వారిరువురు పాల్గొంటారని ఆయన వివరించారు. అనంతరం పెద్దకొడప్గల్లో బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆదివారం పరిశీలించామని ఆయన వివరించారు. ఆయన వెంట పెద్దకొడప్గల్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు మల్లప్పపటేల్ తదితరులున్నారు.