అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Vivek | మంత్రి గడ్డం వివేక్(Minister Gaddam Vivek)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియామకం అయిన వివేక్ గురువారం జిల్లాలో పర్యటనకు బయలుదేరారు. ఆయన నర్సాపూర్‌లో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసి, మెదక్ కలెక్టరేట్(Medak Collectorate)లో అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమాల కోసం ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండగా.. నర్సాపూర్‌లో మంత్రి కాన్వాయ్(Narsapur Ministers Convoy) ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో కార్ల ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.