అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Vivek Vehicle Attack | మంచిర్యాల జిల్లా (Mancherial District) క్యాతనపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సోమవారం వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు మంగళవారం ఎన్నిక నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో మంత్రి వివేక్ వాహనంపై బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి వివేక్ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
Minister Vivek Vehicle Attack | కోరం లేకపోవడంతో..
కోరం లేకపోవడంతో క్యాతనపల్లి ఛైర్పర్సన్ ఎన్నిక (Kaytanapalli Chairperson Election) వాయిదా పడింది. నేడు ఎన్నిక సందర్భంగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణ వస్తుండగా బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులపై సైతం కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే సుమన్, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి చేశారు. దీంతో ఓ బీఆర్ఎస్ నాయకుడి తలకి బలమైన గాయం అయింది.పటాన్చెరు నియోజకవర్గం (Patancheru Constituency)లోని ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఛైర్పర్సన్గా కిషంగుల ప్రమీల, వైస్ ఛైర్మన్గా పట్లోళ్ల హరీష్ రెడ్డి ఎన్నిక అయ్యారు. నిన్న కోరం లేకపోవడంతో మంగళవారం ఎన్నిక నిర్వహించారు.