అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్ (Medak), కామారెడ్డిలో (Kamareddy) భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వాన బీభత్సం సృష్టించింది.
Yellareddy | ఎమ్మెల్యే మదన్మోహన్కు మంత్రి ఉత్తమ్ ఫోన్
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yella Reddy Constituency) వరద పరిస్థితిపై భారీ నీటిపారుదల శాఖ (Major Irrigation Department) మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పందించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌తో (Mla Madan Mohan rao) ఫోన్లో సంభాషించారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. ఎల్లారెడ్డిలో పలు ప్రాంతాల్లో చెరువులు తెగిపోయినందున సత్వర చర్యలు తీసుకోవాలని.. అలర్ట్‌గా ఉండాలని మంత్రి ఎమ్మెల్యేకు సూచించారు.
Yellareddy | అప్రమత్తంగా ఉండాలని సూచనలు..
రాబోయే రెండు మూడు రోజులు సైతం భారీ వర్షాలు ఉన్నందున జిల్లాలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు అలర్ట్‌గా ఉండాలని పేర్కొన్నారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని గ్రామాల్లో చాటింపు వేయించాలని.. అనుకోని పరిస్థితులు ఎదురైతే స్థానిక పోలీస్స్టేషన్లలో సంప్రదించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.
