Homeతాజావార్తలుTummala Nageswar Rao | తనిఖీలతో అధికారులకు షాక్​ ఇస్తున్న మంత్రి.. ఆలస్యంగా వస్తున్న వారిపై...

Tummala Nageswar Rao | తనిఖీలతో అధికారులకు షాక్​ ఇస్తున్న మంత్రి.. ఆలస్యంగా వస్తున్న వారిపై చర్యలు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు షాక్​ ఇస్తున్నారు. పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ సకాలంలో విధులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tummala Nageswar Rao | వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు షాక్​ ఇస్తున్నారు. తన శాఖల పరిధిలోని కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఉదయం పూట ఆఫీసులను తనిఖీ చేస్తున్న ఆయన.. సమయానికి విధులకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు.

నాంపల్లిలోని చేనేత భవన్ (Cheneta Bhavan​)​లో మంత్రి తుమ్మల బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం 10:30 గంటలకు వరకు కూడా కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. టైంకి రాని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మంత్రి తుమ్మల (Minister Tummala) గతంలో సైతం పలు కార్యాలయాలను ఇలాగే తనిఖీ చేశారు.

Tummala Nageswar Rao | ‘ఆగ్రో ఇండస్ట్రీస్’​ ఆఫీస్​లో..

మంత్రి తుమ్మల ఈ నెల 1న ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (Agro Industries Corporation) ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. ఆయన ఆఫీస్​కు వెళ్లే సరికి ఉద్యోగులెవరూ రాకపోవడం గమనార్హం. ఆఫీస్​ టైం అయినా ఒక్కరు కూడా విధులకు రాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆయన మార్కెటింగ్ శాఖ (Marketing Department) ప్రధాన కార్యాలయాన్ని, అగ్రి కమిషనరేట్‌‍ను తనిఖీ చేశారు. సమయపాలన పాటించని అధికారులకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు.

Tummala Nageswar Rao | సమయ పాలన పట్టని వైనం

రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees) సమయ పాలన పాటించడం లేదు. ఇష్టం వచ్చినప్పుడు కార్యాలయాలకు వస్తున్నారు. తమను ఎవరు ఏమి చేయలేరనే భావనలో పలువురు ఉద్యోగులు ఉన్నారు. దీంతో ఆయా కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళ్లిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఉద్యోగులైతే తాము వచ్చిందే టైం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మంత్రి తుమ్మల తనిఖీలతో అధికారులు భయపడుతున్నారు. మిగతా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఇలా తనిఖీలు చేసి, సకాలంలో ఆఫీసులకు రానివారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Must Read
Related News