అక్షరటుడే, కామారెడ్డి : Minister Seethakka | భారీ వర్షాలకు ప్రజలు ఆందోళన చెందొద్దని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) ఒక ప్రకటనలో కోరారు. గురువారం (ఆగస్టు 28) జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) తో కలిసి తాను కూడా కామారెడ్డికి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వరద బీభత్సం బాధాకరమన్నారు.
రాజంపేట మండలంలో ఒకరు మృతి చెందగా.. దోమకొండ మండలంలో వరదల్లో ఇద్దరు కొట్టుకు పోయారని, కామారెడ్డి పట్టణంలో నాలాలో ఒక వృద్ధుడు కొట్టుకుపోయారని సమాచారం అందినట్లు తెలిపారు.
Minister Seethakka | జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..
ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ SDRF బృందాలు కామారెడ్డి Kamareddy కి రానున్నాయని షబ్బీర్ అలీ తెలిపారు. ప్రభుత్వం అలర్ట్ గా ఉందని, ఇప్పటికే ఉభయ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, సీపీలతో సీఎం రేవంత్ రెడ్డి టేలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్టు తెలిపారు.
జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని, దానికంటే ముందు ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఏ సహాయం అవసరం అయినా తనకు ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. మండల, గ్రామ నాయకులు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.