అక్షర టుడే, ఇందూరు: Minister Seethakka | మహిళా సమాఖ్య కార్యకలాపాల నిర్వహణ కోసం జిల్లాల్లో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, నవంబర్ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) సూచించారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణా రావుతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో (additional collectors) వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు (government school students) యూనిఫాం కుట్టిచ్చే బాధ్యతలను మహిళా సంఘాలు సమర్ధవంతంగా నిర్వహించాయన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
- జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరగాలని, ప్రజాప్రతినిధులతో విద్యార్థులకు (students) యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని సూచించారు. పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రం చేయించాలని, వర్షపు నీరు (rainwater) నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అన్ని అంగన్వాడీలలో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో త్వరలో వేయి అంగన్వాడీ కేంద్రాలకు (Anganwadi centers) సొంత భవనాలు నిర్మించనున్నామని తెలిపారు.
- కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంక్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్స్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, ఆర్టీసీ అద్దె బస్సులు నడపడం వంటి అనేక కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్ (Additional Collectors Ankit), కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, డీపీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్, ఏపీడీ రవీందర్, ఐకెపి డీపీఎం సాయిలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.