అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Ponnam Prabhakar | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అశోక్ నగర్లో రూ.ఆరు కోట్లతో నిర్మించిన వంతెను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. దీంతో ప్రజలకు దూరభారం తగ్గనుంది.
నగరంలో కనెక్టివిటీని బలోపేతం చేసేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు (Municipal Corporation Officers) అశోక్ నగర్ సమీపంలో వెంతన నిర్మించారు. హుస్సేన్ సాగర్ మిగులు నాలాపై రూ.ఆరు కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేశారు. దీంతో సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ – AV కాలేజ్, గగన్‌మహల్ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుదంఇ. 48.2 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు బ్రిడ్జి కట్టారు.
Minister Ponnam Prabhakar | సమయం ఆదా
గతంలో వంతెన లేని సమయంలో ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో దూరభారంతో పాటు, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం వంతెనతో సిగ్నల్-రహిత కారిడార్ ఏర్పడింది. లిబర్టీ జంక్షన్, GHMC ప్రధాన కార్యాలయానికి దాదాపు 10 నిమిషాల్లో చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీంతో ప్రజల సమయం ఆదా అవుతోంది. కొత్త వంతెన ప్రయాణికులు, విద్యార్థులు, స్థానికులకు సురక్షితమైన, సున్నితమైన మార్గాన్ని అందిస్తుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో చుట్టుపక్కల రోడ్లపై రద్దీ తగ్గి, ట్రాఫిక్ సమస్యలు (Traffic Problems) తప్పుతాయి.
Minister Ponnam Prabhakar | వసతుల కల్పనకు చర్యలు
మంత్రి పొన్నం వంతెనను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో రోడ్లు, డ్రెయినేజీలు, పార్కులు ఇతర వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.