అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Urea | రాష్ట్రంలో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే.. ఆ అధికారులను స్పాట్లో సస్పెండ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. ఇకపై పీఏసీఎస్ కేంద్రాల ద్వారా మాత్రమే రైతులకు యూరియా సరఫరా చేయాలన్నారు.
యూరియా అక్రమ రవాణాను అధికారులు అరికట్టాలని ఆదేశించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు.
Urea | అందుకే యూరియా కొరత
రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన స్థాయిలో యూరియా సరఫరా చేయలేదని మంత్రి ఆరోపించారు. అందువల్లే కొరత ఏర్పడిందన్నారు.
సాంకేతిక సమస్యలతో రామగుండంలో ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పారు. యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖాధికారులు ఇతర శాఖల సిబ్బందిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Urea | కాంగ్రెస్‌ను దీవించండి
రాష్ట్రంలో రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)ను దీవించాలని మంత్రి పొంగులేటి కోరారు. కూసుమంచిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరదలను కూడా బీఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రారంభించింది, కూలింది బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అని పొంగులేటి అన్నారు. దానిపై అసెంబ్లీలో చర్చిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అర్హత లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో భట్టి విక్రమార్కకు అసెంబ్లీలో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.