అక్షురటుడే, వెబ్‌డెస్క్ : Nara Lokesh | వైసీపీ అధినేతి వైఎస్ జగన్ (YS Jagan)కు ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. జగన్ గురువారం నెల్లూరులో పర్యటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఎమర్జెన్సీ వాతావరణం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ వాతావరణం ఉంటే అసలు వైఎస్ జగన్ బయటకు రాగలరా అని ఆయన ప్రశ్నించారు. జగన్ హయాంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇంటి గేటుకు తాళ్లేసి కట్టలేదా అన్నారు. తల్లి, చెల్లి మీద ఎవరైనా కేసులు పెడతారా అని జగన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో గెలిచానని సంబరాలు చేసుకుంటారా అన్నారు. తల్లి మీద కేసు పెట్టి సంబరాలు చేసుకున్న ఏకైక వ్యక్తి జగన్ అని విమర్శించారు.
Nara Lokesh | రూ.45 వేల కోట్ల పెట్టుబడులు
సింగపూర్ (Singapore) పర్యటన విజయవంతం అయిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.