HomeతెలంగాణKonda Surekha | కడియం నల్లికుట్ల మనిషి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha | కడియం నల్లికుట్ల మనిషి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | ఉమ్మడి వరంగల్​ (Warangal) జిల్లా కాంగ్రెస్​లో విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నల్లికుట్ల మనిషని ఆమె అన్నారు.

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (Kadiyam Srihari), రేవూరి ప్రకాశ్​రెడ్డి (Revuri Prakash Reddy)పై మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి గురువారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇతర పార్టీలో గెలిచిన నాయకులు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కడియంను ఉద్దేశించి ఆయన అన్నారు. మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్​లోని పలువురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు సమావేశం ఆయన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో మీడియా చిట్​చాట్​లో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు.

Konda Surekha | కడియం నామోషీగా ఫీల్​ అవుతున్నారు

తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి కడియం శ్రీహరి నామోషీగా ఫీల్ అవుతున్నారని కొండా సురేఖ అన్నారు. అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. సీఎం దగ్గరకు, పొంగులేటి దగ్గరకు వెళ్లి తన మీద ఉన్నది లేనిది చెబుతున్నారని విమర్శించారు. తన అదృష్టం ఉండటంతో మంత్రిని అయ్యానని ఆమె పేర్కొన్నారు. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు కదా అని ప్రశ్నించారు. తన కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదని, కడియం కూతురుకి అదృష్టం ఉంది ఎంపీ అయ్యిందని ఆమె అన్నారు. వరంగల్​లోని భద్రకాళి ఆలయ అభివృద్ధిని వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.