అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Surekha | తెలంగాణ మంత్రి కొండా సురేఖకు (Minister Konda Surekha) ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఆమెకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను 2026 ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖ గతేడాది కేటీఆర్‌పై రాజకీయ విమర్శలు చేశారు. ఈ క్రమంలో నటులు నాగచైతన్య – సమంత (Naga Chaitanya and Samantha) విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), కేటీఆర్ ఇద్దరూ కొండా సురేఖపై పరువు నష్టం దావాలు దాఖలు చేశారు. అయితే ఇటీవల అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో నాగార్జున తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
అయితే కేటీఆర్ దాఖలు చేసిన కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధుల కోర్టు మంత్రి కొండా సురేఖకు నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.