అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Konda surekha | తెలంగాణ మంత్రి కొండా సురేఖ Konda surekha ఈ మధ్య పలు వివాదాలతో వార్తలలో నిలుస్తున్నారు. అయితే ఆమె తాజాగా సచివాలయం వద్ద కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వైద్యాధికారులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. లో బీపీ కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు. సచివాలయంలోని కేబినెట్(Cabinet) హాల్లో జరుగుతున్న సమావేశానికి పాల్గొనేందుకు వెళ్తుండగా ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న మంత్రులు, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సిబ్బంది స్పందించి వైద్యులను సమీపానికి పిలిపించారు. ఈ ఘటన సచివాలయం ఆరో అంతస్తులో చోటు చేసుకోగా, అక్కడే ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టీం మంత్రికి ప్రథమ చికిత్స అందించారు.
Minister Konda surekha | అంతా ఓకే..
లో బీపీ(Low BP) కారణంగా కళ్లు తిరిగిపడిపోయినట్టు సమాచారం. కొండా సురేఖ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరా తీశారు. కొండా సురేఖకు లో బీపీ కారణంగా అస్వస్థత ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. కాసేపటి విశ్రాంతి తర్వాత ఆమెను పూర్తిస్థాయిలో స్థిరంగా చూసి, పరిస్థితి అదుపులో ఉందని నిర్ధారించారు. కాసేపటికి ఆమె మళ్లీ సాధారణ స్థితికి వచ్చి, సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఘటనపై సీఎం కార్యాలయం CM Office ఆమె ఆరోగ్యంపై సమాచారం తీసుకుంటూ, అవసరమైనన్నీ వైద్య సహాయాలను అందించేందుకు సూచనలు జారీచేసింది.
కొండా సురేఖ(Konda Surekha) గతంలోనూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి చురుగ్గా వ్యవహరించడంతో పాటు తమ కృషితో గుర్తింపు పొందిన నేత. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడం కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ఊరట కలిగిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న సమయంలో, వరంగల్‌లో Warangal జరిగిన అధికారిక వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో, మంత్రి కొండా సురేఖ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పొరపాటున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి.