అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha | వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Forest Minister Konda Surekha) స్పందించారు. మంత్రి హోదాలో రెండు ధర్మకర్తల పోస్టులు భర్తీ చేసే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించారు. శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో (Warangal East constituency) పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం కొండ సురేఖ విలేకరులతో మాట్లాడారు. భద్రకాళీ ఆలయ పాలకవర్గానికి సంబంధించి అధిష్టానం పంపించిన పేర్లను తాను ఎంపిక చేశానని చెప్పారు.
Konda Surekha | అదృష్టం కొద్దీ గెలిచిండు..
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలించాడని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. నాయిని రాజేందర్ రెడ్డిపై (Nayini Rajender Reddy) తాను వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు. అయినా తన కన్నా ముందు ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ఇప్పుడు అయ్యాడని ఎద్దేవా చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలస్తున్నానని తెలిపారు. ఆలయ పాలక వర్గ ధర్మకర్తల విషయంలో కూడా రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు.
Konda Surekha | స్వేచ్ఛ లేదా..?
మంత్రి హోదాలో గుడిలో రెండు ధర్మకర్తల పోస్టులను భర్తీ చేసే స్వేచ్ఛ తనకు లేకపోవటం బాధాకారమని సురేఖ వ్యాఖ్యానించారు. అయితే, తాను భర్తీ చేసినవి కూడా అధిష్టానం పంపిన పేర్లేనని వెల్లడించారు. అయినా ఏదో కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
Konda Surekha | వరంగల్ కాంగ్రెస్ లో ముదిరిన వివాదం..
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో (Warangal district Congress party) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. భద్రకాళీ ఆలయ ధర్మకర్తల నియామకంపై వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో దుమారం చెలరేగింది. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై ఆమె వ్యతిరేక వర్గం పీసీసీకి ఫిర్యాదు చేసింది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా భద్రకాళి ఆలయ పాలక మండలిని నియమించడంపై పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (PCC chief Mahesh Kumar Goud) ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలోని భద్రకాళి దేవస్థానంలో తనకు సమాచారం ఇవ్వకుండా ఇద్దరు ధర్మకర్తలను నియమిస్తూ కొండా సురేఖ ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొండా సురేఖ ఏకపక్ష వైఖరి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. జిల్లా ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం పార్టీకి మంచిది కాదని పేర్కొన్నారు. తాము ఏది చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళీ ఆలయ (Bhadrakali temple) పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రానా ఏదైనా చేయొచ్చా..? అని నిలదీశారు. మంత్రి కొండా సురేఖ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోమని నాయిని స్పష్టం చేశారు. అంతా మంత్రి చేశాక స్థానికంగా తాను ఉన్నది ఎందుకని అని ప్రశ్నించారు.