అక్షరటుడే, బాన్సువాడ: Mudhiraj Mahasabha Appointment | తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జీగా బాన్సువాడ మండలం (Banswada Mandal) ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన మంత్రి గణేష్ నియమితులయ్యారు.
కామారెడ్డి జిల్లా (Kamareddy District) ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు భూపాల్ విజయానంద్ ముదిరాజ్ మంగళవారం ఆయనను అధికారికంగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.
Mudhiraj Mahasabha Appointment | బాధ్యతాయుతంగా.. నిర్మాణాత్మక ధోరణిలో..
ఈ సందర్భంగా అధ్యక్షుడు భూపాల్ విజయానంద్ మాట్లాడుతూ ముదిరాజ్ సర్వతోముఖాభివృద్ధి కోసం బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మక ధోరణిలో విధులు నిర్వహిస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. సమాజంలోని యువత, మహిళలు, రైతులు, కార్మికుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మంత్రి గణేష్ (Minister Ganesh) మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముదిరాజ్ ఐక్యత, అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. జాతి హక్కులు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానని, సంఘ బలోపేతానికి అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు, పెద్దలు, యువకులు పాల్గొని మంత్రి గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
