అక్షరటుడే, వెబ్‌డెస్క్: Central Budget 2026 | ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా మైనింగ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) తెలిపారు. అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీత దీని లక్ష్యం అన్నారు. ఆయా రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
దేశంలో సంస్కరణల యాత్ర విజయవంతంగా సాగుతోందని సీతారామన్ తెలిపారు. ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపట్టిందన్నారు. బయో ఫార్మా శక్తి పథకానికి (Bio-Pharma Shakti scheme) ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల కేటాయింపులు చేస్తామన్నారు. ఆరోగ్య పురోగతి కోసం బయోఫార్మా వ్యూహాన్ని హైలైట్ చేశారు. క్యాన్సర్, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం చేపడుతామన్నారు.
Central Budget 2026 | సెమికండక్టర్ మిషన్‌కు..
దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు చేస్తామని నిర్మలమ్మ తెలిపారు. కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు కేటాయించారు. జౌళి రంగానికి బడ్జెట్లో చేయూత అందించారు. సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభిస్తామన్నారు.
Central Budget 2026 | టెక్స్టైల్ రంగం అభివృద్ధికి
దేశంలో కొత్త మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు చేస్తామన్నారు. ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహానికి పథకం తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకం తెస్తామన్నారు. 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూత అందిస్తామని వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించారు.