అక్షరటుడే, ఇందూరు: BJP OBC Morcha | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం దాస్నగర్లో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల కళాశాల (Mahatma Jyotibapule Gurukul College) ముందు నిరసన తెలిపారు.
BJP OBC Morcha | వసతిగృహాల్లో కష్టాలెన్నో..
ఈ సందర్భంగా స్వామియాదవ్ మాట్లాడుతూ.. వసతిగృహాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారని తెలిపారు. నాణ్యమైన ఆహారం లేక తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. గత వారం రోజుల్లోనే 8 మంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం తోనే విద్యార్థుల ప్రాణాలను కోల్పోతున్నారని, ఇటువంటి ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
BJP OBC Morcha | నష్టపరిహారం చెల్లించాలి..
మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలన్నారు. నాణ్యమైన ఆహారం, వైద్య సదుపాయం, సరిపడా టాయిలెట్లను నిర్మించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ వినోద్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ధర్మపతి, నరేష్ గౌడ్, సాయిలు, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.