అక్షరటుడే, బాల్కొండ : School Education | విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించాలని ఎంఈవో బట్టు రాజేశ్వర్ (MEO Battu Rajeshwar) సూచించారు. ముప్కాల్ మండలం (Mupkal Mandal)లోని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కనీస సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించి బీ గ్రేడ్‌ను ఏ గ్రేడ్‌కు తీసుకువచ్చేలా చూడాలని అన్నారు.అటెండెన్స్‌ను ఉదయం 10గంటల్లోపు నమోదు చేయాలని, మధ్యాహ్న భోజన వివరాలను ప్రతిరోజు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు.
పాఠశాలకు రాని విద్యార్థులను (Students) గుర్తించి తిరిగి చేర్పించాలని, వివరాలను సరిచూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్ఎం ఎం. ప్రశాంత్ కుమార్, కాంప్లెక్స్ సెక్రెటరీ రాస రవి కుమార్, స్టేట్ రిసోర్స్‌పర్సన్ బోయడ నర్సయ్య, సీఆర్పీలు ప్రభాకర్, రజిని పాల్గొన్నారు.
