Nizamabad Collector
Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా మినీ ట్యాంక్ బండ్ ను తీర్చిదిద్దాలి

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్​ను అభివృద్ధి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మినీ ట్యాంక్ బండ్​తో (Mini Tank Bund) పాటు న్యాల్ కల్ రోడ్ ఆర్టీసీ డిపో-2, పద్మానగర్, గౌతంనగర్ తదితర ప్రాంతాలను సందర్శించారు.

మినీ ట్యాంక్ బండ్ వద్ద ఆహ్లాదకర వాతావరణం, ఉద్యానవనం, చిన్నారుల కోసం ప్లేజోన్ తదితర వసతులు ఉండడంతో.. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న బాక్స్ క్రికెట్​ను (box cricket) వినియోగంలోకి తెచ్చేందుకు వీలుగా దీని నిర్వహణను ప్రైవేటు వారికి వేలంపాట ద్వారా కేటాయించాలని ఆదేశించారు. రఘునాథ చెరువులో (Raghunatha Cheruvu) బోటింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టేందుకు పరిశీలించాలని సూచించారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ మడిగెలకు పూర్తి స్థాయిలో అద్దె వసూలు చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఇందులో ఉంటున్న వారు అద్దె చెల్లించకపోతే వారి ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త వారికి మడిగెలు అద్దెకు ఇవ్వాలని సూచించారు.

* పద్మానగర్, న్యాల్​కల్​ రోడ్, గౌతంనగర్​లలో చేపట్టనున్న ఇంజినీరింగ్, రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన ప్రదేశాలను కలెక్టర్ సందర్శించి, అధికారులకు సూచనలు చేశారు. గౌతంనగర్​లో తాగునీటి ట్యాంక్​కు మరమ్మతులు జరిపించాలని సూచించారు. ట్యాంక్ చుట్టూ నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Nizamabad Collector | రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపై సమీక్ష

నగర పాలక సంస్థ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం నిర్వహించిన సమీక్ష సందర్భంగా చేసిన సూచనలను పక్కాగా పాటిస్తున్నారా, ఏమేరకు ప్రగతి సాధించారనే అంశాలను పరిశీలించారు.

టౌన్ ప్లానింగ్ విభాగం (Town Planning department) పనితీరులో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రెవెన్యూ విభాగం పనితీరులో (Revenue Department officials) మార్పు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యుటేషన్​లకు సంబంధించిన దరఖాస్తులను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని సూచించినప్పటికీ ఎందుకు అలసత్వం చేస్తున్నారని రెవెన్యూ విభాగం అధికారులను నిలదీశారు. ప్రతి దరఖాస్తును ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు.

దరఖాస్తుదారులే సంబంధిత పోర్టల్ ద్వారా మ్యుటేషన్ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా నేరుగా నగర పాలక సంస్థ కార్యాలయానికి (Municipal Corporation office) వచ్చి దరఖాస్తు చేసుకుంటే.. వాటిని రెవెన్యూ విభాగం అధికారులు ఆన్​లైన్​లో నమోదు చేయాలని చెప్పారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవిబాబు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.