అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief Mahesh Goud | జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఇంఛార్జీ మంత్రులు, 18 మంది కార్పొరేషన్ ఛైర్మన్లకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది.
ఉప ఎన్నికలపై తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం (MIM) తమ ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వారి మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని చెప్పారు. త్వరలో తమ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
PCC Chief Mahesh Goud | ఏ శక్తి ఆపలేదు
జూబ్లీహిల్స్‌లో తప్పుకుండా గెలిచి తీరుతామని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు.
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) కొట్టివేయడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎలాగైనా రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.