అక్షరటుడే, బోధన్ : Nomination Rejection | మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎంఐఎం అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఆ పార్టీ నాయకులు బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality) వద్ద ఆందోళనకు దిగారు.
Nomination Rejection | ఎంఐఎం నాయకుడి నామినేషన్..
ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ (MIM President Mir Ilyas Ali) నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు శనివారం మున్సిపాలిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నామినేషన్ తిరస్కృతిపై వివరాలు తెలుసుకున్న ఆ పార్టీ హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ హుటాహుటిన బోధన్ వచ్చి సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో (Sub Collector Vikas Mahato) మాట్లాడారు. ఎంఐఎం బోధన పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ వ్యాపార సంస్థలకు చెందిన టాక్స్ చెల్లించలేదనే కారణంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.
Nomination Rejection | ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో..
తమ నాయకుడి నామినేషన్ తిరస్కరించడంపై ఎంఐఎం పార్టీ నాయకులు (MIM Party Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులకు సంబంధించి పన్నులు నామినేషన్‌కు ముందే చెల్లించినప్పటికీ వాటిని అధికారులు ఆన్లైన్లో నమోదు చేయలేని నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై నామినేషన్ వేసే సందర్భంలో మున్సిపల్ కమిషనర్‌కు మీర్ ఇలియాస్ అలీ టాక్స్ చెల్లించినట్లు తెల్ల కాగితంపై రాసి కమిషనర్‌కు సైతం వివరించారని.. అయినప్పటికీ రిటర్నింగ్ అధికారుల వద్ద టాక్స్‌కు సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారు నామినేషన్ తిరస్కరించారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. నామినేషన్ తిరస్కృతిపై హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం ఎమ్మెల్సీ (MIM Hyderabad MLC), సభ్యులు బోధన్ సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.