Bakrid Nizamabad
Bakrid| మున్సిపల్​ కమిషనర్​కు కలిసిన ఎంఐఎం నాయకులు

అక్షరటుడే, ఇందూరు: Bakrid | నగరంలో బక్రీద్​ పండుగను పురస్కరించుకుని మున్సిపల్​ కార్పొరేషన్​ తరపున సౌకర్యాలు కల్పించాలని ఎంఐఎం (MIM Nizamabad) నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్​ కమిషనర్​ దిలీప్​కుమార్​కు (Corporation Commissioner Dilip Kumar) వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ సందర్భంగా పారిశుధ్యలోపం తలెత్తకుండా చూడాలని విన్నవించారు. వచ్చే నెలలో నగరంలోని జోన్​–3, 4, 5 పరిధిలో ప్రత్యేక మున్సిపల్​ వాహనాలు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రెయినేజీ సమస్యలు రాకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. కమిషనర్​ను కలిసిన వారిలో ఎంఐఎం జిల్లాధ్యక్షుడు ఫయాజ్​ తదితరులున్నారు.