అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: MIM Nizamabad | వచ్చే నెలలో జరుగనున్న బక్రీద్ పండుగకు సౌకర్యాలు కల్పించాలని ఎంఐఎం నాయకులు కోరారు. సోమవారం సీపీ సాయి చైతన్యను కలిసి (CP Sai Chaitanya) పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగకు (Bakrid festival) సంబంధించి పోలీస్‌శాఖ తరపున టోల్‌ఫ్రీ నంబర్ (Toll-free number) ఏర్పాటు చేయాలని విన్నవించారు. తద్వరా పండుగకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు మైనార్టీలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా సహకరించాలని కోరారు. సీపీని కలిసిన వారిలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ తదితరులు ఉన్నారు.