అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: MIM Nizamabad | నిజామాబాద్ నగరంలో ఎంఐఎం పార్టీ నాయకులు (MIM party leaders) శనివారం సమావేశం అయ్యారు. ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలపై (municipal elections) చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా నాయకులు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ను (MP Asaduddin Owaisi) కలిసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన మున్సిపల్ ఎన్నికలకు నాయకుల దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లా నాయకులు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
MIM Nizamabad | ఒంటరిగానే పోటీ..?
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారుకు ఎంఐఎం అనుకూలంగానే ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ప్రత్యక్షంగా పొత్తు పొట్టుకున్న సందర్భాలు లేవు. జూబ్లీహిల్స్ తదితర ఉప ఎన్నికల్లో పరోక్షంగా సహకారం అందించిన విషయం తెలిసిందే. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఒంటిరిగానే పోటీ చేయనుంది.
ప్రస్తుతం ఎంఐఎం చీఫ్ అసద్ మహారాష్ట్రలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. కాగా.. తిరిగి వచ్చిన తర్వాత పోటీ అంశంపై స్పష్టత రానుంది. కాగా.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా నిజామాబాద్ కార్పొరేషన్లో పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన నాయకులు మరోసారి పోటీకి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.