అక్షరటుడే, కోటగిరి : Milad Un Nabi | మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలద్ ఉన్ నబి (Milad Un Nabi) పండుగను ముస్లింలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో పండుగను చేసుకున్నారు.
స్థానిక సాదిక్ మసీదు నుంచి పలు వీధుల్లో ముస్లిం భారీ ఊరేగింపు నిర్వహించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ చౌరస్తా (Ambedkar Chowrasta) వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మైనారిటీ యాక్టివ్ లీడర్ జుబేర్(Minority active leader Zubair) మాట్లాడుతూ.. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర జీవనశైలి గురించి వివరించారు. ప్రవక్త సర్వ మానవాళి శాంతితో ఉండాలని సందేశం ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రతి ముస్లిం కూడా మహ్మద్ ప్రవర్త చూపిన బాటలోనే నడవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ అబ్దుల్ హమీద్, అమన్ యూత్ అధ్యక్షుడు జమీర్, బాబుఖాన్, మసూద్, ఇంతియాజ్, వహీద్, ముషరాఫ్, ఉమన్, వాజిద్, ముస్లింలు, తదితరులు పాల్గొన్నారు.