అక్షరటుడే, కామారెడ్డి : Vehicle Inspections | రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. గురువారం అర్ధరాత్రి తర్వాత భిక్కనూరు టోల్ గేట్ వద్ద సీఐ సంపత్ (CI Sampath) ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు పోలీసులు డ్రంకన్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీలు చేపట్టారు.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆర్టీసీ బస్సులు (RTC Buses), ట్రావెల్స్ బస్సులు (Travels Buses), లారీలు, కార్లు, డీసీఎంలు లాంటి 1,139 వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో 27 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.
Vehicle Inspections | ట్రావెల్ బస్సు సీజ్..
ఓ ట్రావెల్ బస్సు డ్రైవర్ 45 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించి బస్సును సీజ్ చేశారు. ప్రయాణికులను ఇతర వాహనంలో సురక్షితంగా తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడిపిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం.. ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని తెలిపారు. వాహనం ఏదైనా మద్యం సేవించి నడపరాదన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.