ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMidday meals | నిలిచిన మధ్యాహ్న భోజనం.. ఇంటిదారి పట్టిన విద్యార్థులు

    Midday meals | నిలిచిన మధ్యాహ్న భోజనం.. ఇంటిదారి పట్టిన విద్యార్థులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Midday meals | పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు పస్తులుండిపోయారు. బుధవారం దేశవ్యాప్త కార్మికుల సమ్మెల కారణంగా జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు ఒకరోజు సమ్మె చేపట్టారు. దీంతో మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (midday meals) నిలిచిపోయింది.

    Midday meals | నిజాంసాగర్​ మండల కేంద్రంలో..

    నిజాంసాగర్ మండల కేంద్రంలోని (Nizamsagar mandal center) ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం అందించలేదు. దీంతో మాగి గోర్గుల్​, జీఎస్​ఆర్​ ఫ్యాక్టరీ వడ్డేపల్లి గ్రామాల విద్యార్థులు మధ్యాహ్నానికి ఇళ్లకు వెళ్లిపోయారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ఉండి చదువుకునే విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసి తిరిగి స్కూల్​కు వెళ్లారు. బీసీ వసతి గృహంలో విద్యార్థులకు అప్పటికప్పుడు భోజనాలు తయారు చేయించారు.

    READ ALSO  Sp Rajesh Chandra | పోగొట్టుకున్న 150 ఫోన్ల రికవరీ

    Midday meals | ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక..

    నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం చర్చనీయాంశమైంది. దేశవ్యాప్త సమ్మె ఉన్నట్లు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఉపాధ్యాయులు మాత్రం పక్కనే ఉన్న బీసీ వసతి గృహం (BC hostel) నుంచి భోజనాన్ని తెప్పించుకొని భోజనం చేసినట్లు తెలిసింది. విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్లిపోయారు.

    Midday meals | ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు

    – తిరుపతిరెడ్డి, ఎంఈవో

    నిజాంసాగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు భోజనం ఏజెన్సీ నిర్వాహకులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో బుధవారం మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయలేకపోయారు. అందుకే విద్యార్థులు ఇంటి బాట పట్టారు. మరోసారి ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం.

    Latest articles

    Shravana Masam | శ్రావణం.. శుభాలనొసగే వ్రతాల మాసం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Shravana Masam | స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు(Shri Maha Vishnu)కు, ఆయన దేవేరి అయిన...

    Maharashtra | మ‌హిళా రిసెప్ష‌నిస్ట్‌పై రోగి బంధువు దాడి.. అలాంటోడిని వ‌ద‌లొద్దు అంటూ జాన్వీ క‌పూర్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra | మహారాష్ట్ర థానే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఓ దారుణ...

    Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా అభిజ్ఞాన్​ మాల్వియా

    అక్షరటుడే, ఆర్మూర్ : Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా (Armoor Sub-Collector) అభిజ్ఞాన్​ మాల్వియా నియమితులయ్యారు....

    Bombay Trains Blast Case | బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.. నిందితుల‌కు నోటీసులు జారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Bombay Trains Blast Case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన...

    More like this