అక్షరటుడే, ఇందూరు: Midday meal | ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని ప్రజా సంఘాల నాయకులు ఆల్గోట్ రవీందర్, నర్రా రామారావు (Narra ramarao) డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో (Dharna Chowk) కొనసాగుతున్న దీక్షకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని చెబుతున్నా.. ఛార్జీలు మాత్రం పెంచడం లేదన్నారు. అలాగే వంట కార్మికుల వేతనాలు కూడా ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇన్సూరెన్స్ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ (AITUC) ప్రధాన కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (Mid-day meal scheme workers union) గౌరవాధ్యక్షుడు సాయమ్మ, నాగలక్ష్మి, వనజ, గంగామణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.