అక్షరటుడే, ఇందూరు: Midday Meal | జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కుకింగ్ కాస్ట్, సీసీహెచ్‌ల (CCH) గౌరవ వేతనం విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ (DEO Ashok) తెలిపారు. 2025–26కు సంబంధించిన పెండింగ్, రెగ్యులర్ బిల్లుల కోసం నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
జూన్ నెల వరకు సంబంధించి ఒకటి నుండి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వంట ఖర్చులు, వంట సహాయకుల గౌరవ వేతనం కోసం నిధుల మొత్తాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. ఇందులో కుకింగ్ కాస్ట్‌కు గాను రూ.2,17,32,028, అలాగే కుక్ కం హెల్పర్ల గౌరవ వేతనం రూ.48.74 లక్షలు విడుదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. నిధులను ఎంఈవో (MEO) ఎస్ఎన్ఏ అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు.