అక్షరటుడే, ఇందూరు: Panchayat Elections | రెండు విడత పంచాయితీ ఎన్నికల సందర్భంగా 12వ తేదీ సాయంత్రం 5 నుంచి ప్రచారపై నిషేధం అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నియమావళిని అనుసరిస్తూ ఈ నిబంధన అందరికీ వర్తిస్తుందన్నారు.
14న రెండో విడత ఎన్నికలు..
ధర్పల్లి (Dharpally), డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్, నిజామాబాద్, సిరికొండ (Sirikonda) జక్రాన్ పల్లి మండలాల్లో ఈనెల 14న ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ నేపథ్యం 12వ తేదీ సాయంత్రం తర్వాత ఎన్నికల ప్రచారం చేయరాదని సూచించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలన్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు సంబంధిత మండలాల్లో మద్యం, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.