HomeతెలంగాణMetro Train Charges | మెట్రో రైలు ప్ర‌యాణికుల‌కి గుండె గుబేల్‌మ‌నే వార్త‌.. త్వరలో ఛార్జీల...

Metro Train Charges | మెట్రో రైలు ప్ర‌యాణికుల‌కి గుండె గుబేల్‌మ‌నే వార్త‌.. త్వరలో ఛార్జీల మోత‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Metro Train Charges | నగరంలో నిత్యం జాబ్ చేసేందుకు ఆఫీస్‌కు వెళ్లే వారు ట్రాఫిక్‌(Traffic)లో ఎంత న‌ర‌క‌యాత‌న ప‌డుతుంటారో మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే మెట్రో(Metro) వ‌చ్చాక వారికి కొంత సులువు అయింది.

స్టూడెంట్స్ Students కూడా చాలా మంది మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. సులభ ప్రయాణం కోసం ఉద్యోగులు కూడా మెట్రో ఎక్కుతూ ఉంటారు. అయితే వీళ్లకు ఇప్పుడు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. వారం రోజుల్లో మెట్రో రైలు చార్జీలు(Hyderabad Metro Train Charges) పెరగబోతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి పెంచిన మెట్రో చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా చార్జీలను పెంచనున్నారు.

Metro Train Charges | రేట్లు ఇలా ఉంటాయా..

ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)తో మెట్రో అధికారులు భేటీ కానుండ‌గా, ఆ భేటిలో సీఎం నుంచి అనుమతి తీసుకొని పెంచిన చార్జీలను అమల్లోకి తీసుకొచ్చేందుకు మెట్రో యాజమాన్యం(Metro Management) సిద్ధమైంది. కరోనా సమయంలో ఏడాదిపాటు ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోపై రూ.6,598కోట్ల భారం ప‌డింది. అయితే, కొంతకాలంగా మెట్రో చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)లో ప్రస్తుతం రోజుకు 1,200 సర్వీసులు నడుస్తుండగా.. 4.80లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

ప్రస్తుతం చార్జీల కంటే 25 నుంచి 30శాతం పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. చార్జీల పెంపుతో ప్రతీయేటా రూ.150 నుంచి 170 కోట్ల వరకు వార్షిక ఆదాయం రాబట్టుకోవాలని, తద్వారా కొంతైనా నష్టాల భారాన్ని తగ్గించుకోవచ్చునని మెట్రో యాజమాన్యం(Metro Management) భావిస్తోంది.

రెండు కిలో మీటర్ల దూరం వరకు ప్రస్తుతం ఛార్జీ రూ.10 ఉండగా.. రూ.15కు పెరిగే అవకాశం ఉంది. 2 నుంచి 4 కిలో మీటర్లు ప్రస్తుతం ఛార్జీ రూ.15 ఉండగా.. రూ. 20కి పెరిగే అవకాశం ఉంది. అలాగే 4 నుంచి 6 కిలోమీటర్లు ప్రస్తుతం ఛార్జీ రూ.25 ఉండగా.. రూ. 35 వరకు పెరిగే అవకాశం ఉంది. 6 నుంచి 8 కిలో మీటర్లు ప్రస్తుతం ఛార్జీ రూ.30 ఉంది. రూ.40 పెరిగే అవకాశం. 8 నుంచి 10 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ.35 ఉంది. రూ. 45కు పెరిగే అవకాశం ఉంది.

10 నుంచి 14 కిలో మీటర్లకు రూ.55కు, 14నుంచి 18 కిలో మీటర్లకు రూ.60కు, 18 నుంచి 22 కిలో మీటర్లకు రూ.65కు, 22 నుంచి 26 కిలో మీటర్లకు రూ.70కు, 26 కిలో మీటర్లకుపైన రూ.75కు పెరిగే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Must Read
Related News