HomeతెలంగాణWeather Report | వాతావరణ శాఖ అలర్ట్.. మళ్లీ పెరగనున్న ఎండలు

Weather Report | వాతావరణ శాఖ అలర్ట్.. మళ్లీ పెరగనున్న ఎండలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Report | రాష్ట్రంలో మళ్లీ ఎండలు పెరగనున్నాయి. మే నెలలో అకాల వర్షాలతో పాటు రుతుపవనాలు ముందుగా రావడంతో వర్షాకాలాన్ని (Rainy Season) తలపించేలా వానలు పడ్డాయి. అయితే జూన్​ ప్రారంభం నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. తిరిగి ఎండలు మండనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు పడుతున్నా.. భారీ వర్షాలు (Heavy Rains) లేవు. దీంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. మే నెలలో వానలు పడటంతో ఇప్పటికే పలువురు రైతులు వరి సాగు (Paddy Crop) కోసం తుకాలు పోశారు. అయితే వర్షాలు లేక వాటికి నీరు అందడం లేదు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో బ్యాడ్​ న్యూస్​ చెప్పింది.

Weather Report | వడగాలులు, ఉక్కపోత

జూన్ 6-11 తేదీలో తూర్పు, ఉత్తర తెలంగాణల్లో ఉష్ణోగ్రతలు (Temperature in Telangana) మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్రమైన వేడి, ఉక్కపోత ఉంటుందని తెలిపింది. అధిక వేడి కారణంగా సాయంత్రం పూట చెదురుమొదురు వానలు పడే ఛాన్స్ కూడా​ ప్రకటించింది.