Homeతాజావార్తలుMeta layoff | మెటాలో మరో లేఆఫ్ షాక్.. 600 మంది ఉద్యోగులకు టర్మినేషన్ నోటీసులు

Meta layoff | మెటాలో మరో లేఆఫ్ షాక్.. 600 మంది ఉద్యోగులకు టర్మినేషన్ నోటీసులు

Meta layoff | టెక్ దిగ్గజం మెటా భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో పనిచేస్తున్న దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Meta layoff | టెక్ దిగ్గజం మెటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో పనిచేస్తున్న దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టెక్ దిగ్గజం మెటా Meta మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. తాజాగా కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో పనిచేస్తున్న దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించనుందనే సమాచారం వెలువడింది. ఈ విషయాన్ని ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమో ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది.

Meta layoff | ఏఐపై మెటా దృష్టి

కంపెనీ తమ ఏఐ యూనిట్‌ను AI Unit మరింత సరళంగా, వేగంగా పనిచేసే విధంగా పునర్‌వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ ఉద్యోగులకు పంపిన మెమోలో.. “టీమ్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడం మరింత వేగంగా జరుగుతుంది. తక్కువ చర్చలతో ఎక్కువ ప్రభావం చూపగల టీమ్‌గా మారతాం. ప్రతి ఒక్కరిపై బాధ్యత మరింత పెరుగుతుంది” అని పేర్కొన్నారు.

ఈ తొలగింపుల ప్రభావం ప్రధానంగా ఫేస్‌బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ (FAIR) యూనిట్‌తో పాటు ప్రొడక్ట్ ఏఐ, ఏఐ మౌలిక సదుపాయాల విభాగాలపై ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇక, తాజాగా ఏర్పాటు చేసిన TBD ల్యాబ్ యూనిట్.. అత్యాధునిక ఏఐ మోడల్స్‌పై పనిచేస్తున్న ఈ విభాగంపై మాత్రం ఈ కోత ప్రభావం ఉండదని నివేదికలు చెబుతున్నాయి.

ఇక సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గత కొంతకాలంగా ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి, మెటాను ఆ దిశగా దూకుడుగా నడిపిస్తున్నారు. అయినప్పటికీ, పునర్‌వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగులను తొలగించడం టెక్ వర్గాల్లో వివాదాస్పదంగా మారింది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్య ద్వారా మెటా ఏఐ రేసులో AI Race మరింత వేగంగా దూసుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Must Read
Related News