అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lionel Messi | తన GOAT ఇండియా టూర్లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సి తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారాను మెస్సీ ప్రత్యేకంగా విజిట్ చేశారు. జంతువులతో సరదాగా గడిపిన మెస్సీ.. అక్కడి ఏర్పాట్లను చూసి ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వంతారా పర్యటన సందర్భంగా అనంత్ అంబానీ (Anant Ambani) మెస్సీకి ఒక అరుదైన, అత్యంత ఖరీదైన గిఫ్ట్ అందించారు. ఫుట్‌బాల్ స్టార్‌కు Richard Mille RM 003-V2 GMT Tourbillon – Asia Edition లగ్జరీ వాచ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ వాచ్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 పీస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Lionel Messi | అనంత్ అంబానీ చేతికి మరో అరుదైన వాచ్
ఈ గడియారం విలువ దాదాపు 1.2 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.10.91 కోట్లుగా తెలుస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. వంతారాకు వచ్చినప్పుడు మెస్సీ చేతికి ఎలాంటి వాచ్ లేకపోవడం, అనంత్ అంబానీతో భేటీ అనంతరం అతడి చేతిపై ఈ లగ్జరీ టైమ్‌పీస్ దర్శనమివ్వడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక అనంత్ అంబానీ సైతం వంతారా సందర్శన సమయంలో మరో ఖరీదైన వాచ్‌ను ధరించడం గమనార్హం. ఆయన చేతిపై కనిపించిన Richard Mille RM 056 Sapphire Tourbillon విలువ దాదాపు 5 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.45.59 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
మెస్సీ – అనంత్ అంబానీ భేటీ, వంతారా సందర్శన, లగ్జరీ వాచ్ గిఫ్ట్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్‌కు అంబానీ కుటుంబం ఇచ్చిన ఈ ప్రత్యేక గిఫ్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది రోజులుగా మెస్సీ పర్యటన భారత్‌లో సాగుతుంది. ఇటీవల హైదరాబాద్‌లో కూడా మెస్సీ సందడి చేశారు. ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.