అక్షరటుడే, వెబ్‌డెస్క్: MESSI vs REVANTH | ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ Lionel Messi 14 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి భారత్‌లో అడుగుపెట్టారు. 2011లో కోల్‌కతాలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం ఆయన భారతదేశానికి రావడం ఇది రెండోసారి. ‘GOAT ఇండియా టూర్’ పేరుతో మూడు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు. ఫుట్‌బాల్ ప్రోత్సాహం, ఛారిటీ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ టూర్ ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.ఈ టూర్లో భాగంగా శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
MESSI vs REVANTH | నేటి నుండే పర్యటన..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ Sharukh Khan, భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు. అలాగే శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం మెస్సీ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 7వర్సెస్7 ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా మెస్సీ గౌరవార్థం సంగీత కచేరీతో పాటు ప్రీమియం మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేక ఫోటో సెషన్ కూడా జరగనుంది. ఒక్కో ఫోటో కోసం రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేయనున్నట్లు సమాచారం.
ఆదివారం ముంబైలో మెస్సీ పర్యటన కొనసాగనుంది. ఇక్కడ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ Rohit Sharma, ఎంఎస్ ధోనీ, శుభ్‌మన్ గిల్ వంటి ప్రముఖ క్రికెటర్లతో పాటు నటి కరీనా కపూర్, నటుడు జాన్ అబ్రహం వంటి సెలబ్రిటీలతో సమావేశమవుతారు. పర్యటన చివరి రోజైన సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మెస్సీ భేటీ కానున్నారు. ఇక హైదరాబాద్‌లో జరగనున్న మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ హైదరాబాద్ రాప్ సింగర్ కేడన్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. పాటలు, డ్యాన్స్‌లతో హైదరాబాద్ సంస్కృతి, బిర్యానీ, ఇరానీ చాయ్ గొప్పదనాన్ని ఆయన తన ప్రదర్శనలో చూపించనున్నారు. అలాగే తెలుగు సినిమాల ప్రాభవం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.