అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lionel Messi | అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న లియోనెల్ మెస్సీ ఉప్పల్ (Uppal) స్టేడియానికి వచ్చారు. మెస్సీతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం అయింది.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఫొటో షూట్ అనంతరం మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఆయనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ సైతం స్టేడియానికి వచ్చారు. కానుంది. రాత్రి 7.50 గంటలకు వారు స్టేడియానికి చేరుకున్నారు. దీంతో అభిమానుల్లో జోష్ నెలకొంది. మెస్సీ మెస్సీ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. 20 నిమిషాల పాటు జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.
Lionel Messi | స్టేడియం పరిసరాల్లో సందడి
ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసరాల్లో సందడి నెలకొంది. మ్యాచ్‌కు ముందు స్టేడియంలో లేజర్ షో ఆకట్టుకుంది. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ (Mangli) మ్యూజికల్ ఈవెంట్ అలరించింది. స్టేడియానికి రాకముందు ఫలక్‌నుమా ప్యాలెస్ (Falaknuma Palace)లో ఫ్యాన్స్‌తో మెస్సీ ఫొటోలు దిగారు. ఒక్క ఫొటోకు నిర్వాహకులు రూ.10 లక్షలు వసూలు చేశారు. ఫొటో సెషన్ సమయాన్ని నిర్వాహకులు కుదించారు. ఉప్పల్ స్టేడియం బందోబస్తును రాచకొండ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ డ్రోన్ నిఘా వ్యవస్థ ద్వారా ఫీల్డ్ అధికారులకు సీపీ దిశానిర్దేశం చేస్తున్నారు.
Lionel Messi | భారీ బందోబస్తు
కోల్‌కతా (Kolkata) ఘటన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియానికి వచ్చే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. కొద్దిసేపు మాత్రమే మ్యాచ్ ఉంటుందని, అభిమానులు సహకరించాలని కోరుతున్నారు.