అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Messi Tour | ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు, అర్జెంటినాకు చెందిన లియోనెల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో నగరంలో మెస్సీ మెనియాతో ఊగిపోతుంది. ఆయనను చూడటం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
గోట్ టూర్ (Goat Tour)లో భాగంగా మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం కోల్‌కతా (Kolkata) పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీకి సీఎం రేవంత్ (CM Revanth) స్వాగతం పలికారు. కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో హైఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టికెట్ ఉన్న వారు ముందుగానే చేరుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో స్టేడియం ఇప్పటికే మెస్సీ జెర్సీలతో నిండిపోయింది. జెర్సీ నంబర్ 10తో ఉపల్ స్టేడియానికి మెస్సీ ఫ్యాన్స్ వస్తున్నారు.
Messi Tour | కాసేపట్లో మ్యాచ్
ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి, మెస్సీ టీంల మధ్య రాత్రి 8:11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 7.50 గంటలకు ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మెస్సీతో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ స్టేడియానికి వస్తారు. రాత్రి 8.06 గంటలకు సీఎం రేవంత్, 8.07 గంటలకు మెస్సీ గ్రౌండ్లోకి రానున్నారు. 8:11 గంటలకు వీరిద్దరి మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
Messi Tour | రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
మెస్సీ మ్యాచ్‌ను తిలకించడానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం మధ్యాహ్నమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.