అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lionel Messi | ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కోల్‌కతా టూర్ (Kolkata Tour)లో గందరగోళం నెలకొంది. మెస్సీ త్వరగా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు.
మెస్సీ గోట్ టూర్లో భాగంగా కోల్‌కతాలో సాల్ట్ లేక్ స్టేడియంలో పర్యటించాడు. దీని కోసం చాలా మంది అభిమానులు రూ.5వేల నుంచి రూ.25 వరకు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేశారు. అయితే మెస్సీని సరిగా చూడలేకపోయామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ త్వరగా వెళ్లిపోయాడని, ఉన్న సమయంలో కూడా నాయకులు, ప్రముఖులతో సెల్ఫీలు దిగారని పేర్కొన్నారు. స్టేడియం చుట్టూ ఒక రౌండ్ కూడా తిరగలేదని ఆగ్రహంతో బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు యత్నించారు.
Lionel Messi | 70 అడుగుల విగ్రహం
ఫుట్‌బాల్ లెజండ్ మెస్సీ ముందుగా సాల్ట్‌లేక్ స్టేడియం (Salt Lake Stadium)లో అభిమానులను పలకరించాడు. అనంతరం మెస్సీ 70 అడుగుల విగ్రహం ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ (Bollywood Actor Shah Rukh Khan) పాల్గొన్నాడు. అయితే మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో నిరాశ చెందిన అభిమానులు ఆందోళన చేపట్టారు. పది నిమిషాలు కూడా ఆయన స్టేడియంలో లేరని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు వృథా అయ్యాయని వాపోయారు. ఫ్యాన్స్ ఆందోళనతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Lionel Messi | రాత్రికి హైదరాబాద్‌లో మ్యాచ్
గోట్ టూర్లో భాగంగా పలు రాష్ట్రాల్లో మెస్సీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి హైదరాబ్లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాల నుంచి అతిథులు రానున్న నేపథ్యంలో పోలీసులు స్టేడియం, స్టేడియానికి వెళ్లే మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
#WATCH | Kolkata, West Bengal: Angry fans threw bottles and chairs from the stands at Kolkata’s Salt Lake Stadium
Star footballer Lionel Messi has left the Salt Lake Stadium in Kolkata.
More details awaited. pic.twitter.com/mcxi6YROyr
— ANI (@ANI) December 13, 2025